kcr: కేసీఆర్ కు చంద్రబాబు భయం పట్టుకుంది!: సోమిరెడ్డి

  • చంద్రబాబును తిడితే ఓట్లు పడతాయనే భ్రమలో కేసీఆర్ ఉన్నారు
  • మోదీ నుంచి కేసీఆర్ వరకు అందరూ చంద్రబాబుకు భయపడుతున్నారు
  • తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లో భయం ఎక్కువవుతోందని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఓటమి భయంతోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీలపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ దగ్గర నుంచి చంద్రబాబు వరకు అందరూ చంద్రబాబుకు భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబును తిడితే ఓట్లు పడతాయనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని... కేసీఆర్ తీరును ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు.

చంద్రబాబు వల్లే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందనే కేటీఆర్ వ్యాఖ్యలను కేసీఆర్ మరిచిపోయారా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. టీడీపీ వల్లే కేసీఆర్ ఒక రాజకీయ నేతగా ఎదిగారని... ఆయన మంత్రివర్గంలో ఉన్న సగం మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లేనని... ఆ విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని చెప్పారు. కేసీఆర్ వల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోందనే నిజాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని తెలిపారు. 

kcr
KTR
Chandrababu
modi
somireddy
TRS
Telugudesam
  • Loading...

More Telugu News