KCR: ఓటమి భయంతో కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు: గండ్ర

  • కేసీఆర్ పని అయిపోయింది.. ఇక ఫామ్ హౌస్ కే పరిమితం
  • ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ దే విజయం
  • ప్రజల విశ్వాసాన్ని టీఆర్ఎస్ కోల్పోయింది

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ దే విజయమని ఆ పార్టీ సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పని అయిపోయిందని... ఇకపై ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం కానున్నారని చెప్పారు. ఓటమి భయంతోనే కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని టీఆర్ఎస్ కోల్పోయిందని చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ్ మండలంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

KCR
gandra venkataramana reddy
congress
TRS
  • Loading...

More Telugu News