ooti: ఊటీలో 250 అడుగుల లోయలో పడిన కారు: ఐదుగురి దుర్మరణం

  • మరో ముగ్గురికి తీవ్రగాయాలు
  • ఊటీకి 24 కిలోమీటర్ల దూరంలో ఘటన
  • బాధితులంతా చెన్నైవాసులు

ఊటీకి 24 కిలోమీటర్ల దూరంలోని  250 అడుగుల లోయలో కారు పడిపోయిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రగాయాలపాయ్యారు. చెన్నైకి చెందిన ఎనిమిది మంది స్నేహితులు టూర్‌లో భాగంగా ఊటీ పరిసరాల సందర్శనకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని కోయంబత్తూరులోని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనపై పోలీసు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News