Vijay: నేనే సీఎం నైతే సినిమాలోలా వుండదు!: తమిళ హీరో విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • వైభవంగా 'సర్కార్' ఆడియో విడుదల వేడుక
  • సీఎంనయితే సినిమాలోలా మాత్రం ఉండబోను
  • అవినీతి నిర్మూలనకు ప్రాధాన్యమిస్తానన్న విజయ్

తానే ముఖ్యమంత్రిని అయితే, అవినీతిపైనే తన పోరాటం ఉంటుందని తమిళ నటుడు విజయ్ వ్యాఖ్యానించాడు. ఆయన హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కార్' ఆడియో విడుదల సందర్భంగా మాట్లాడిన విజయ్, పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని ఇవ్వడంతో, దీనికి ఇప్పుడే ఆస్కార్ వచ్చినట్టుందని అన్నాడు.

తన ఇటీవలి చిత్రం 'మెర్సల్' (తెలుగులో అదిరింది)లో కొన్ని రాజకీయ సన్నివేశాలున్నాయని, 'సర్కార్'లో రాజకీయాలు అదిరిపోతాయని అన్నాడు. ఈ చిత్రానికి అభిమానులు ఓటు వేస్తారనే నమ్ముతున్నానని, ఈ చిత్రంలో నటించినట్టుగా నిజ జీవితంలో తాను ముఖ్యమంత్రిని అయితే, సినిమాలో చేసినట్టుగా చేయబోనని చెబుతూ, అవినీతి నిర్మూలనకు ప్రాధాన్యమిస్తానని అన్నాడు.

పాలకుడు అడ్డదారిలో వెళితే, మిగతావారంతా కూడా అదే దారిలో నడుస్తారని కూడా వ్యాఖ్యానించాడు విజయ్. దీంతో ఈ సినిమాలో సీఎం పాత్రలోని ఓ కోణంలో విజయ్, అవినీతిని ప్రోత్సహించేలా  కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News