Balakrishna: ఒకే వేదికపై నుంచి ప్రసంగించనున్న బాలకృష్ణ, విజయశాంతి!

  • 1990 దశకంలో సూపర్ హిట్ పెయిర్
  • ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి వేర్వేరు పార్టీల్లో
  • తెలంగాణ ఎన్నికల కోసం టీడీపీ, కాంగ్రెస్ పొత్తు
  • కలసి పని చేయనున్న బాలకృష్ణ, విజయశాంతి

నందమూరి బాలకృష్ణ, విజయశాంతి... 1990 దశకంలో వెండితెరపై వీరిద్దరిదీ ఎంత సూపర్ హిట్ జంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ తరువాత మారిన పరిస్థితుల నేపథ్యంలో వీరు ఇరువురూ రెండు వేర్వేరు పార్టీల్లో కొనసాగారు. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా, విజయశాంతి తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉండగా, ఈ రెండు పార్టీలూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో త్వరలో తెలంగాణలో జరిగే ఓ బహిరంగ సభలో వీరిద్దరూ కలసి పాల్గొంటారని తెలుస్తోంది. వచ్చే 40 రోజుల్లో 90 నియోజకవర్గాల్లో విజయశాంతి పర్యటనలు ఇప్పటికే ఖరారయ్యాయి. తెలుగుదేశం పార్టీ సైతం ప్రజల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్యను పూర్తి స్థాయిలో రంగంలోకి దించాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. చాలా రోజుల తరువాత వీరిద్దరూ కలసి ఓ కూటమి తరఫున పనిచేయనుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Balakrishna
Vijayasanti
Telangana
Elections
  • Error fetching data: Network response was not ok

More Telugu News