Chandrababu: తొలుత విజయవాడ ఆపై తిరుపతి.. నేడు చంద్రబాబు పర్యటన వివరాలు!

  • ప్రకృతి సేద్యంపై రైతన్నలతో ముఖాముఖి
  • అనంతరం శ్రీసిటీ సెజ్ లో డిక్సన్ కంపెనీ ప్రారంభం
  • షియోమీ టీవీని ఆవిష్కరించనున్న బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడ, తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో చంద్రబాబు రైతులతో సమావేశం అవుతారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో చంద్రబాబు ముఖాముఖి భేటీ అయి ఈ రకమైన వ్యవసాయంపై వారి అనుభవాన్ని అడిగి తెలుసుకుంటారు. అనంతరం తిరుపతికి బయలుదేరుతారు.

తిరుపతిలో సమీపంలోని శ్రీసిటీలో ఏర్పాటు చేసిన డిక్సన్ కంపెనీని చంద్రబాబు ప్రారంభిస్తారు. శామ్ సంగ్, షియోమీ, సోనీ, ప్యానసోనిక్ కంపెనీలకు అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ కంపెనీ తయారుచేస్తోంది. అలాగే టీవీలు, సీసీటీవీల తయారీలోనూ డిక్సన్ కంపెనీకి మంచి పేరుంది. తొలిదశలో భాగంగా ఈ సంస్థ రూ.150 కోట్ల పెట్టుబడితో 800 మంది యువతకు ఉపాధిని కల్పించింది.

త్వరలోనే రెండోదశలో భాగంగా మరో 700 మందికి కంపెనీ ఉద్యోగాలు కల్పించనుంది. అలాగే షియోమీ కంపెనీ తయారుచేస్తున్న ఎంఐ టీవీని చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. అనంతరం చంద్రబాబు అమరావతికి బయలుదేరుతారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు ఆయన కుమారుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొననున్నారు.

  • Loading...

More Telugu News