Rajkot: భారత్-విండీస్ తొలి టెస్ట్.. పది శాతం టికెట్లు మాత్రమే అమ్ముడుపోయిన వైనం!
- రాజ్‌కోట్ స్టేడియం సీటింగ్ సామర్థ్యం 25 వేలు
- కేవలం 2 వేల టికెట్లను మాత్రమే అమ్మిన అధికారులు
- ఆదరణ ఎందుకు లేదో అర్థం కావడం లేదన్న ఎస్‌సీఏ
క్రికెట్‌లో వేగం పెరిగి టీ20 క్రికెట్ తెరపైకి వచ్చాక లాంగెస్ట్ ఫార్మాట్ టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గింది. ఈ విషయం ఇప్పుడు మరోమారు రుజువైంది. నేటి నుంచి రాజ్‌కోట్‌లో భారత్-విండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్‌సీఏ) స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇక ఈ స్టేడియం మొత్తం సామర్థ్యం 25 వేలు కాగా, కేవలం పదిశాతం టికెట్లను మాత్రమే విక్రయించినట్టు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. కేవలం 2 వేల టికెట్లను మాత్రమే విక్రయించామని, టెస్టు క్రికెట్‌పై అభిమానులు ఎందుకు అంత ఆసక్తి చూపించడం లేదో అర్థం కావడం లేదని అధికారులు పేర్కొన్నారు. అయితే, స్కూలు విద్యార్థుల కోసం పదిశాతం టికెట్లను రిజర్వు చేశామని, కాబట్టి వారు హాజరు అవుతారని బీసీసీఐ పేర్కొంది.