Lok Sabha: ఎంపీల వేతనాల వివరాలను వెల్లడించిన లోక్ సభ సెక్రెటేరియట్!

  • స.హ. చట్టం ద్వారా ఎంపీల వేతనాన్ని కోరిన చంద్రశేఖర్
  • నాలుగేళ్లలో రూ.1554 కోట్ల వేతనాలు
  • నాలుగు ఆర్థిక సంవత్సరాలో రూ.1997 కోట్లు

ఎంపీల వేతనాల వివరాలను తెలియజేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ సమాచార హక్కు చట్టం ద్వారా లోక్‌సభ సెక్రెటేరియట్‌ను కోరారు. దీంతో ఎంపీల వేతనాలకు సంబంధించిన వివరాలను సెక్రెటేరియట్ వెల్లడించింది. లోక్‌సభ ఎంపీ ఒక్కొక్కరు సగటున ఏడాదికి రూ.71.29 లక్షల వేతనం ... అలాగే రాజ్యసభ సభ్యుడు సగటున ఏడాదికి రూ.44.33 లక్షలను అందుకున్నట్లు తెలుస్తోంది.

 గత నాలుగేళ్లలో లోక్‌సభ సభ్యులు దాదాపు రూ.1554 కోట్ల పైచిలుకే వేతనాలను అందుకోగా.. రాజ్యసభ సభ్యులందరూ సుమారు రూ.443 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఎంపీలకు జీతాలు, ప్రోత్సాహకాలు కలుపుకొని రూ.1997కోట్లు చెల్లించినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది.

Lok Sabha
Rajya Sabha
chandrasekhar goud
RTI
  • Loading...

More Telugu News