Amitabh Bachchan: కేబీసీలో రూ.7 కోట్లు గెలుచుకునేదే.. కానీ రూ.కోటితో సరిపెట్టుకుంది!

  • రూ.7కోట్ల ప్రశ్న అడిగిన బిగ్ బి
  • రూ.కోటితో వైదొలుగుతానని చెప్పిన బినిత
  • రూ.కోటితో పాటు కారు కూడా గెలుచుకుంది

బాలీవుడ్ ప్రముఖ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రస్తుతం 10వ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఈ కార్యక్రమంలో అసోంలోని గువాహటికి చెందిన బినిత జైన్ రూ.కోటి గెలుచుకున్నారు. అయితే ఆమె రూ.7కోట్లు గెలుచుకోవాల్సింది కానీ ధైర్యం ప్రదర్శించకపోవడంతో రూ.కోటితో వెనుదిరిగారు. రూ.కోటి గెలుచుకున్న అనంతరం ఆమె రూ. 7కోట్ల ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంది కానీ తప్పు చెబితే అప్పటి వరకూ సంపాదించుకున్నదంతా పోతుంది. ఈ పరిస్థితుల్లో ఆమె రిస్క్ తీసుకునే సాహసం చేయలేదు.

రూ.7కోట్ల ప్రశ్నగా అమితాబ్ ‘1867లో మొదటి స్టాక్‌ టికెట్‌ను ఎవరు కనుగొన్నారు?’ అని అడిగారు. ప్రేక్షకులు ఆమె సమాధానం చెబుతారా? లేదా? అని ఆసక్తిగా చూడసాగారు. బినితకు సమాధానం తెలుసు. కానీ అది తప్పైతే అప్పటి వరకూ గెలుచుకున్నదంతా పోతుంది కాబట్టి ఆమె వైదొలుగుతానని ప్రకటించారు. అనంతరం ఆమె సమాధానం చెప్పగా అది సరైనదని తేలింది. కానీ వైదొలుగుతానని చెప్పడంతో రూ.కోటితో సరిపెట్టుకున్నారు. దీంతో పాటు ఒక కారు కూడా బినిత గెలుచుకున్నారు.  

Amitabh Bachchan
kaun banega karodpathy
binitha jain
  • Loading...

More Telugu News