Tamilnadu: తల్లి మృతదేహానికి కుమారుడి అఘోరా పూజలు.. జడుసుకున్న గ్రామస్తులు!

  • తమిళనాడులోని తిరుచ్చిలో ఘటన
  • అఘోరాగా మారిన కుమారుడు
  • తల్లి శవంపై కూర్చుని పూజలు

అఘోరాగా మారిన ఓ కుమారుడు తల్లికి తమదైన రీతిలో అంత్యక్రియలు నిర్వహించాడు. అతనికి మరికొందరు అఘోరాలు తోడుగా వచ్చారు. అందరూ కలిసి అంత్యక్రియలు నిర్వహించడంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జడుసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని తిరువెరుంబూర్ అరియమంగళంలో మేరీ అనే మహిళ చనిపోయింది. దీంతో ఆమె కుమారుడు మణికంఠన్ అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చాడు. వారణాసి వెళ్లి అఘోరాగా మారిపోయిన అతను తల్లి శవంపై కూర్చుని అంత్యక్రియలు నిర్వహించాడు. అనంతరం మిగిలిన అఘోరాలతో కలిసి ఈ క్రతువును పూర్తిచేశాడు. ఈ అంత్యక్రియల్లో కొందరు సమీప బంధువులు పాల్గొనగా, మిగిలిన గ్రామస్తులంతా జడుసుకుని ఇళ్లకే పరిమితమయ్యారు.

Tamilnadu
aghora
last rites
mother
son
tiruchi
  • Loading...

More Telugu News