kcr: కేసీఆర్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన సొంత నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు

  • కాంగ్రెస్ లో చేరిన గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్ పూర్ నేతలు
  • కేసీఆర్ ఫార్మ్ హౌస్ ఉన్నది ఇక్కడే
  • కేసీఆర్ ఇలాఖాలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్న ఉత్తమ్

ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు యావత్ టీఆర్ఎస్ శ్రేణులకు ఇది షాకింగ్ న్యూసే. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ కు చెందిన నేతలు, వారి అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. జగదేవ్ పూర్ ఎంపీపీ రేణుకతో పాటు, ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచ్ లు, ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

రేణుకతో పాటు ఎంపీటీసీలు మమతాభాను, కవిత యాదగిరి, కౌన్సిలర్లు భాగ్యలక్ష్మి, దుర్గాప్రసాద్ లు పార్టీ మారారు. కేసీఆర్ ఫార్మ్ హౌస్ జగదేవ్ పూర్ పరిధిలోనే ఉండటం గమనార్హం. రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువైన ఈ ప్రాంతం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ లో చేరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గజ్వేల్ లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. 

kcr
gajwel
jagdevpur
TRS
congress
Uttam Kumar Reddy
  • Loading...

More Telugu News