kidari: కిడారి, సోమల హత్యలతో సంబంధం ఉందని నిరూపిస్తే.. నన్ను నేనే శిక్షించుకుంటా: పాంగి రాజారావు

  • హత్యల వెనుక రాజకీయ హస్తం ఉందని ఆరోపించడం సబబు కాదు
  • కిడారి, సోమలతో కొన్ని అంశాల్లోనే నేను విభేదించాను
  • మా మధ్య వ్యక్తిగతమైన విభేదాలు లేవు

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మల్యే సోమలను మావోయిస్టులు హత్య చేశారన్న బాధ నుంచి తాను ఇంకా కోలుకోలేదని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు పాంగి రాజారావు తెలిపారు. ఇలాంటి సమయంలో హత్యల్లో తన ప్రమేయం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తుండటం తనను మానసిక క్షోభకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

హత్యలతో తనకు సంబంధం ఉన్నట్టు ఎవరైనా నిరూపిస్తే... తనను తాను శిక్షించుకుంటానని చెప్పారు. హత్యల వెనుక రాజకీయ హస్తం ఉందని ఆరోపించడం సరికాదని అన్నారు. కిడారి, సోమలతో రాజకీయపరంగానే కొన్ని అంశాలలో తాను విభేదించానని... అంతేతప్ప తమ మధ్య వ్యక్తిగతమైన విభేదాలు లేదని చెప్పారు. తనతో వారు కూడా ఏనాడు విభేదించలేదని అన్నారు. లేనిపోని ఆరోపణలతో తన కుటుంబసభ్యులు కూడా ఆవేదనకు లోనవుతున్నారని అన్నారు.

kidari
soma
pangi rajarao
maoist
Telugudesam
  • Loading...

More Telugu News