MVVS Murthy: ఈ వార్త నిజం కాకపోతే ఎంత బాగుండునో!: 'గీతం' మూర్తి మృతిపై గంటా శ్రీనివాస్

  • మూర్తి మరణవార్త విని కలతచెందాను
  • పార్టీ కార్యాలయానికి తరలివస్తున్న కార్యకర్తలు
  • మరికాసేపట్లో సంతాప తీర్మానం: గంటా

అమెరికా పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మృతి చెందారన్న వార్త తనను ఎంతగానో కలచివేసిందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కొద్దిసేపటిక్రితం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ వార్త నిజం కాకపోతే ఎంతో బాగుంటుందని అన్నారు.

వాస్తవానికి తాను నేడు అమరావతికి వెళ్లాల్సి వుందని, ఈ వార్త తెలియడంతో, ఇక్కడి టీడీపీ కార్యకర్తలు, ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారని, పార్టీ కార్యాలయానికి వందలాదిగా తరలివస్తున్నారని చెప్పారు. దీంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తాను ఇక్కడే ఉండిపోయానని చెప్పారు. మరికాసేపట్లో టీడీపీ స్థానిక నేతలంతా సమావేశమై, మూర్తి మరణం పట్ల సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించనున్నామని ఆయన వెల్లడించారు.

MVVS Murthy
Ganta Srinivasa Rao
Vizag
  • Loading...

More Telugu News