vijay devarakonda: 'నోటా' నుంచి కొన్ని సన్నివేశాల తొలగింపు

  • రాజకీయాల నేపథ్యంలో 'నోటా'
  • ముఖ్యమంత్రిగా విజయ్ దేవరకొండ 
  • ఈ నెల 5వ తేదీన సినిమా రిలీజ్

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'నోటా' చిత్రం రూపొందింది. రాజకీయాల నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాను, ఈ నెల 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొన్ని సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ సభ్యులు భావించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కొన్ని వివాదాస్పదమైన సన్నివేశాలు .. డైలాగులు వున్నట్టుగా సెన్సార్ సభ్యులు గుర్తించారట.

 అభ్యంతరకరమైన ఆ సన్నివేశాలను తొలగించాలనీ, ఆ డైలాగులను మ్యూట్ చేయాలని వారు సూచించినట్టుగా సమాచారం. సెన్సార్ సభ్యుల సూచనలకు తగినట్టుగా ఈ సినిమా యూనిట్ సభ్యులు, ఆయా సన్నివేశాలను తొలగించే పనిలో వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రిగా కనిపించనున్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. ఈ సినిమాలో ఆయన జోడీగా మెహ్రీన్ అలరించనున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News