Kerala: శబరిమలకు తాము వెళ్లబోమంటూ... రోడ్డెక్కిన లక్షలాది మంది మహిళలు... వీడియో!

  • అయ్యప్ప దగ్గరికి ఎవరైనా వెళ్లొచ్చు
  • శబరిమల ఆలయంపై సుప్రీం తీర్పు
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేరళ మహిళలు

కేరళలో కొలువుదీరిన అయ్యప్ప ఆలయంలోకి ఏ వయసు మహిళలైనా వెళ్లవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ, లక్షలాది మంది రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. "స్వామియే అయ్యప్పా... అయ్యప్పా స్వామియే" అంటూ మహిళాలోకం వీధుల్లో కదం తొక్కింది.

తాము శబరిమలకు వెళ్లేది లేదని పలువురు మహిళలు ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం గమనార్హం. తాము చిన్నతనంలో స్వామిని దర్శించుకున్నామని, తిరిగి ఎప్పుడు దర్శించుకోవాలో తమకు తెలుసునని అన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఎవరైనా స్వామి దర్శనానికి వస్తే తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. కదలివచ్చిన మహిళా సముద్రంలా కనిపిస్తున్న ర్యాలీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూడవచ్చు.

Kerala
Sabarimala
Ayyappa
Rally
Protest
  • Error fetching data: Network response was not ok

More Telugu News