NTR: "మదిరప్పా... ఇక్కడ మంది లేరా? కత్తులు లేవా?" అంటూ వచ్చేసిన 'వీర రాఘవ'... గంటల వ్యవధిలో 50 లక్షల వ్యూస్!

  • ఎన్టీఆర్ తాజా చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'
  • నిన్న విడుదలైన థియేటరికల్ ట్రయిలర్
  • లవర్ గా, ఫ్యాక్షనిస్టుగా ఎన్టీఆర్ వైవిధ్యం

ఎన్టీఆర్ తాజా చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ' ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నిన్న విడుదలైన థియేటరికల్ ట్రయిలర్ ను ఇప్పటికే దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. అక్టోబర్ 11న సినిమా విడుదల కానుండగా, వీర రాఘవ పాత్రలో ఓ ప్రియుడిగా, ఓ ఫాక్షనిస్టుగా ఎన్టీఆర్ చూపిన వైవిధ్యం ట్రయిలర్ లో స్పష్టంగా కనిపించింది. "మీ పేరు?" అని ఎన్టీఆర్‌ అడిగితే, పూజా హెగ్డే స్పందిస్తూ, "చాలా.. అడ్రెస్‌, ఫోన్‌ నెంబర్‌ కూడా కావాలా?" అని అడగటం, ఆపై "నేను ఊరికే అడిగానండీ" అని ఎన్టీఆర్ అంటే, "నేను ఊరికే చెప్పనండీ" అని పూజా అనడం త్రివిక్రమ్ మార్క్ డైలాగులను గుర్తు చేశాయి.

ఆపై "మదిరప్పా.. ఇక్కడ మంది లేరా? కత్తులు లేవా?" అంటూ ఎన్టీఆర్‌ తనలోని సీమ పౌరుషాన్ని చూపించడం మాస్ ఆడియన్స్ కు తెగ నచ్చేస్తోంది. చివరగా, "సార్‌... వంద అడుగుల్లో నీరు పడుతుంది అంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసే వాడిని ఏమంటారు? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం సర్‌. తవ్వి చూడండి" అంటూ భావోద్వేగంతో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంది.

  • Loading...

More Telugu News