Bhadradri Kothagudem District: అధికారుల నిర్వాకం... ఉదయం గాంధీకి నివాళి, మధ్యాహ్నం నాటుకోడి ఆహారం!
- ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఘటన
- ఉదయం గాంధీ చిత్ర పటానికి పూలమాలలు అర్పించిన అధికారులు
- ఆపై మధ్యాహ్నం నాన్ వెజ్ భోజనం
గాంధీ జయంతి నాడు, ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన ప్రభుత్వ అధికారులు, ఆపై వెంటనే విందు భోజనం ఏర్పాటు చేసుకుని నాటు కోడి కూరను లాగించేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగింది.
అహింసా మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గాంధీ మహాత్ముని చిత్ర పటానికి పూలమాలలు అర్పించే కార్యక్రమం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఉదయం జరిగింది. ఆ తరువాత కమిటీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఇతర సిబ్బంది మధ్యాహ్నం భోజనాన్ని ఆఫీసులోనే చేయాలని నిర్ణయించుకున్నారు. లంచ్ సమయానికి నాటుకోడి కూరతో విందారగించారు. ఈ అధికారుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.