Telugudesam: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ ఎమ్మెల్సీ, గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం

  • మూర్తి సహా మరో ముగ్గురి దుర్మరణం
  • పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన మూర్తి
  • విషాదంలో టీడీపీ శ్రేణులు

టీడీపీ ఎమ్మెల్సీ, గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలయ్యారు. సోమవారం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూర్తి సహా మరో ముగ్గురు మృతి చెందారు.

 అలస్కాలోని ఆంకరేజ్‌‌ సఫారీని సందర్శించేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో ఈయనతో పాటు కారులో ఉన్న  వెలువోలు బసవపున్నయ్య, వీరమాచనేని శివప్రసాద్, వీబీఆర్ చౌదరి మృతి చెందారు. కడియాల వెంకటరత్నం(గాంధీ) తీవ్రంగా గాయపడ్డారు.

ఈ నెల 6న గీతం యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమావేశంలో మూర్తి ప్రసంగించాల్సి ఉంది. అందుకోసమే ఆయన అమెరికా వెళ్లారు. అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే తానా సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. టీడీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Telugudesam
Andhra Pradesh
MVVS Murthy
Road Accident
America
Geetham University
  • Loading...

More Telugu News