aravinda sametha: ‘అరవింద సమేత’ వేడుక.. ట్రైలర్ విడుదల!

  • హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ప్రీ-రిలీజ్ వేడుక
  • ట్రైలర్ విడుదల చేసిన కల్యాణ్ రామ్
  • అక్టోబరు 11న విడుదల కానున్న ‘అరవింద సమేత’

త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ట్రైలర్ ను నందమూరి కల్యాణ్ రామ్ విడుదల చేశారు. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో కల్యాణ్ రామ్, దర్శకుడు త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ, నటీనటులు జగపతిబాబు, సితార, సునీల్, పాటల రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ, ఈ చిత్రం ట్రైలర్ అదిరిపోయిందని, అక్టోబర్ 11న ఈ చిత్రం విడుదల కానుందని అన్నారు. ఒక నెల క్రితం జరిగిన సంఘటన కారణంగా ఈ సినిమా విడుదల కాదేమోనని కొంతమంది అనుకున్న విషయాన్ని కల్యాణ్ రామ్ ప్రస్తావించారు.

aravinda sametha
kalyanr ram
junior ntr
  • Error fetching data: Network response was not ok

More Telugu News