aayushman: పుట్టినరోజునాడే తనకి కేన్సర్ అని తెలిసింది.. అయినా సినిమాకు వెళ్లాం: ఆయుష్మాన్ ఖురానా

  • తహీరా కశ్యప్‌కు రొమ్ము కేన్సర్
  • భయపడి, బాధపడి లాభం లేదన్న ఖురానా 
  • ముంబైలో చికిత్స తీసుకుంటున్న తహీరా

తన పుట్టినరోజునాడే తన భార్యకు కేన్సర్ అని తెలిసిందని, అయినా తాము సినిమా చూసేందుకు వెళ్లామని బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా తెలిపాడు. దీని గురించి ఆయుష్మాన్ మాట్లాడుతూ ‘‘నా పుట్టినరోజు నాడే తహీరా కశ్యప్ కు కేన్సర్‌ అని తెలిసింది. కానీ ఆ సమయంలో భయపడి, బాధపడి ప్రయోజనం లేదనిపించింది. అందుకే నా భార్యతో కలిసి ‘మన్మర్జియా’ సినిమా చూడటానికి వెళ్లాను.

ఏదన్నా సమస్య వచ్చినప్పుడు బాధపడటంలో అర్థంలేదు. బాధపడినంత మాత్రాన ఆ సమస్య పోదు’’ అన్నాడు. ప్రస్తుతం తహీరా ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.

aayushman
cancer
tahira kashyap
  • Loading...

More Telugu News