New Delhi: ఢిల్లీ సరిహద్దులో 'కిసాన్ క్రాంతి యాత్ర'ను అడ్డుకున్న పోలీసులు

  • ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో అడ్డుకున్న పోలీసులు
  • రైతులపై బాష్పవాయువు, వాటర్ కెనన్స్ ప్రయోగం
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు

స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, రుణాలు మాఫీ చేయాలని, ఇంకా పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రైతులు తలపెట్టిన కిసాన్ క్రాంత్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు ముప్పై వేల మంది రైతులతో సాగుతున్న ఈ ర్యాలీ ఢిల్లీలోకి ప్రవేశించకుండా, బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు.

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ నుంచి సెప్టెంబర్ 23న ఈ ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల మీదుగా ఈ రోజు ఢిల్లీలోని కిసాన్ ఘాట్ కు చేరుకోవాలని ప్రణాళిక రచించారు. ఢిల్లీకి చేరుకునే సమయంలో వేలాది మంది రైతులను ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై బాష్పవాయువు, వాటర్ కెనన్స్ ప్రయోగించారు. దీంతో, వేలాది రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమను ఇలా అడ్డుకోవడం తగదని భారతీయ కిసాన్ యూనియన్ నేత నరేశ్ మండిపడ్డారు.

'మా సమస్యల గురించి ప్రభుత్వానికి కాకుండా ఎవరికి చెప్పాలి? పాకిస్థాన్ కో లేక బంగ్లాదేశ్ కో వెళ్లిపోవాలా?' అని ప్రశ్నించారు. కాగా, రైతులు చేస్తున్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తిప్పికొట్టారు. కిసాన్ ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని, అందుకే, అడ్డుకున్నామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాత్రం ఈ ర్యాలీని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. నగరంలోకి ఈ ర్యాలీని అనుమతించాలని అన్నారు.

  • Loading...

More Telugu News