kcr: పార్టీ నుంచి నన్నెందుకు సస్పెండ్ చేశారో ఇంతవరకు చెప్పలేదు!: కేసీఆర్ పై విజయశాంతి ఫైర్

  • ఫెడరల్ ఫ్రంట్ కోసం ఇతర పార్టీలను ఒప్పించలేకపోయారు
  • కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను తెచ్చానని చెప్పుకుంటున్నారు
  • రానున్న ఎన్నికల్లో పోటీ చేయను, ప్రచారమే చేస్తా 

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఇతర పార్టీలను ఒప్పించలేకపోయారని... అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను తెచ్చానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ కాళ్లమీద పడి కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్... ఆ తర్వాత మాట తప్పారని విమర్శించారు. టీఆర్ఎస్ నుంచి తనను ఎందుకు సస్పెండ్ చేశారో కేసీఆర్ ఇంతవరకు చెప్పలేదని... బహుశా కేటీఆర్, కవితల రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా ఉంటాననే భావనతో సస్పెండ్ చేసి ఉండవచ్చని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని... కాంగ్రెస్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తానని తెలిపారు.

kcr
KTR
kavitha
Sonia Gandhi
vijayashanthi
TRS
congress
  • Loading...

More Telugu News