balakrishna: శ్రీదేవిగా రకుల్ ఫస్టులుక్ వచ్చేది అప్పుడేనట!

  • షూటింగు దశలో 'ఎన్టీఆర్'
  • కీలక సన్నివేశాల చిత్రీకరణ 
  • శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్

క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోంది. ఒక వైపున ముఖ్యమైన పాత్రలకి సంబంధించిన నటీనటులను ఎంపిక చేసుకుంటూనే .. మరో వైపున చకచకా షూటింగును కానిచ్చేస్తున్నారు. ఈ సినిమాలో బసవతారకం పాత్రలో విద్యాబాలన్ .. చంద్రబాబునాయుడు పాత్రలో రానా .. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటించారు. ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో రకుల్ నటించనున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఆమెకి సంబంధించిన వెర్షన్ పూర్తి కావలసింది. కానీ బాలీవుడ్ షూటింగులో ఆమె బిజీగా ఉండటం వలన ఆలస్యమైంది. శ్రీదేవి పాత్ర కోసం రకుల్ 10 రోజులను కేటాయించిందట. ఈ నెల 10వ తేదీన రకుల్ పుట్టినరోజు కావడం వలన, ఆ రోజున శ్రీదేవిగా ఆమె లుక్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారని సమాచారం. ఒక వైపున శ్రీదేవికి గల క్రేజ్ .. మరో వైపున రకుల్ కి గల ఇమేజ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.                

  • Loading...

More Telugu News