Uttam Kumar Reddy: ప్రత్యేకమైన మేనిఫెస్టోను తీసుకొస్తున్నాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • స్వార్థం కోసమే టీఆర్ఎస్ కు ఒవైసీ సోదరులు మద్దతిస్తున్నారు
  • మోదీ ఏజెంట్ కేసీఆర్
  • పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ లు కలిసే పోటీ చేస్తాయి

కేవలం తమ స్వార్థం కోసమే ఒవైసీ సోదరులు టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడమంటే బీజేపీకి ఇచ్చినట్టేనని అన్నారు. ఈ నాలుగేళ్లలో ముస్లింలకు కేసీఆర్ చేసిందేమీ లేదని చెప్పారు. హైదరాబాద్ పాతబస్తీలో బలమైన అభ్యర్థులను నిలుపుతామని అన్నారు.

ఈ ఎన్నికలకు తాము ప్రత్యేకమైన మేనిఫెస్టోను తీసుకొస్తున్నామని తెలిపారు. ముస్లింలలో స్వయం ఉపాధికోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై రెండు రోజుల్లో ఒక స్పష్టమైన ప్రకటనను వెలువరిస్తామని అన్నారు.

ఒవైసీ సోదరులు తమ స్వార్థం కోసం ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. మోదీ ఏజెంట్ కేసీఆర్ అని వ్యాఖ్యానించారు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో కలసే కేసీఆర్ వెళతారని... అందుకే ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లారని చెప్పారు.

Uttam Kumar Reddy
kcr
owaisi
TRS
bjp
congress
mim
modi
  • Loading...

More Telugu News