kanna: బీజేపీలో ఉన్న ఆ ముగ్గురూ ఆంధ్ర ద్రోహులు: బుద్ధా వెంకన్న

  • కన్నా, జీవీఎల్, సోము వీర్రాజులు ఆంధ్ర ద్రోహులు
  • సీబీఐ నోటీసులు అందుకున్న కన్నా.. అవినీతి గురించి మాట్లాడుతున్నారు
  • ఏపీలో బీజేపీ అడ్రస్ గల్లంతవబోతోంది

బీజేపీలో ముగ్గురు ఆంధ్ర ద్రోహులు తయారయ్యారని... రాష్ట్రానికి శనిలా దాపురించారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు ఆంధ్ర ప్రజల పొట్ట కొడుతున్నారని విమర్శించారు.

సర్వేల పేరుతో ప్రధాని మోదీకి దగ్గరైన జీవీఎల్... రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని అన్నారు. అవినీతి కేసుల్లో సీబీఐ నోటీసులు అందుకున్న కన్నా లక్ష్మీనారాయణ... అవినీతి గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదమని చెప్పారు. తిన్నింటి వాసాలను లెక్కించే నైజం కన్నాదని ఎద్దేవా చేశారు. ఆస్తులపై చర్చించేందుకు కన్నా సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఏపీలో బీజేపీ అడ్రస్ గల్లంతు అవబోతోందని చెప్పారు. 

kanna
gvl
somu veerraju
bjp
Telugudesam
modi
budha venkanna
  • Loading...

More Telugu News