Mahendar: అక్కా చెల్లెళ్లను ప్రేమించి విఫలమయ్యారు.. ఇద్దరు టెన్త్ విద్యార్థుల మరణం వెనుక అసలు నిజం!

  • అక్కా చెల్లెళ్లను ప్రేమించిన మహేందర్, రవితేజ
  • అమ్మాయిల తండ్రి హెచ్చరించడంతో ఆత్మహత్య
  • గతంలో ఓ మారు అరెస్టయిన రవితేజ

జగిత్యాలలో తీవ్ర కలకలం రేపిన టెన్త్ విద్యార్థుల మరణం వెనుక మిస్టరీ వీడింది. వీరిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించి, ఆమె కోసం గొడవపడి, ఆత్మహత్యకు పాల్పడ్డారని ఇంతవరకూ భావిస్తుండగా, అది వాస్తవం కాదని, వీరు అక్కా చెల్లెళ్లను ప్రేమించారని, వారి తల్లిదండ్రులు మందలించడంతోనే మద్యం మత్తులో ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. ఘటనా స్థలిలో స్వాధీనం చేసుకున్న మహేందర్, రవితేజల ఫోన్ కాల్స్ నుంచి, కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులు, వీరు అక్కా చెల్లెళ్లతో నిత్యమూ చాటింగ్ చేసేవారని గుర్తించారు.

విషయం తెలుసుకున్న అమ్మాయిల తండ్రి వారిని పలుమార్లు హెచ్చరించారని, నిత్యమూ మద్యం తాగే వీరిని, వారం క్రితం తమ ఇంటి వద్ద చూసిన అమ్మాయిల తండ్రి మరోమారు హెచ్చరించడంతో తమ ప్రేమ విఫలమవుతుందన్న మనస్తాపంతో, మత్తులో ఆత్మహత్య చేసుకున్నారని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. ఇద్దరూ పెట్రోలు కొని తీసుకు వెళుతున్న దృశ్యాలను సేకరించామని, ఆపై కాంపౌండ్ కు వెళ్లి మందు కొట్టారని తెలిపారు. తమ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిపోయిందని కూడా వీరు బాధపడ్డారని చెప్పారు. గతంలో ఓ మారు రవితేజ బాల నేరస్తుడిగా అరెస్ట్ అయ్యాడని వెల్లడించారు.

Mahendar
Raviteja
Jagityal
Sucide
10th Students
  • Loading...

More Telugu News