Andhra Pradesh: నేడు సూర్యుని అద్భుతాన్ని చూసి పులకించిపోయాను: ఏపీసీసీ నేత రఘువీరారెడ్డి
- ఈ ఉదయం అరసవల్లికి వచ్చిన రఘువీరారెడ్డి
- స్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ నేత
- అధికారంలోకి వస్తే వెంటనే ప్రత్యేక హోదా
- పొలాకి నుంచి 'ఇంటింటికీ కాంగ్రెస్' ప్రారంభం
అరసవల్లి శ్రీ సూర్య నారాయణుని దేవాలయంలో ఈ ఉదయం కనిపించిన అద్భుత దృశ్యాన్ని చూసి తాను పులకించి పోయానని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. నేడు సూర్య నారాయణుని దేవాలయానికి వచ్చి, ఉదయం స్వామివారిని దర్శించుకున్న ఆయన ఆపై మీడియాతో మాట్లాడారు. తాను తొలిసారిగా సూర్య కిరణాలు మూలవిరాట్టుపై పడటాన్ని చూశానని, ఇవి తన జీవితంలో అత్యంత మధురమైన క్షణాలని అన్నారు.
నరసన్నపేట మండలం పొలాకి నుంచి 'ఇంటింటికీ కాంగ్రెస్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని వెల్లడించిన ఆయన, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, అన్ని విభజన సమస్యలూ తీరిపోతాయని అన్నారు. తెలుగుదేశం, వైకాపాలు చెరోవైపు నుంచి బీజేపీతో అంటకాగుతున్నాయని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఏపీకి ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం పెడతామన్న రాహుల్ గాంధీ హామీని రఘువీరారెడ్డి గుర్తు చేశారు.