Biggboss: 'ఆర్మీ' అభిమాన వర్షంలో తడిసి ముద్దవుతున్న కౌశల్!

  • బిగ్ బాస్ సీజన్ - 2 విజేత కౌశల్
  • ఫేస్ బుక్ లో లైవ్ లోకి వచ్చిన కౌశల్
  • తమ ప్రాంతానికి రావాలని అభిమానుల కోరిక

టాలీవుడ్ లో అత్యంత ఉత్కంఠను రేపిన బిగ్ బాస్ సీజన్ - 2 విజేత కౌశల్, ఇప్పుడు అభిమాన వర్షంలో తడిసి ముద్దవుతున్నాడు. తనను గెలిపించిన ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు చెబుతూ ఆయన ఫేస్ బుక్ లో లైవ్ కు వచ్చిన వేళ, తమ ఊరికి రావాలంటే, తమ ఊరికి రావాలంటూ అభిమానులు కోరిన కోరికలను చూసి, ఆయన ఉద్వేగానికి గురయ్యాడు.

హౌస్ లో ఉన్న తనకు బయట ఇంతమంది అభిమానులు ఉన్నారని తెలియదని, 'కౌశల్ ఆర్మీ' అంటూ ఒకటి ఏర్పడిందని, వారి కారణంగానే తాను విజయం సాధించానన్న విషయం బయటకు వచ్చిన తరువాతే అర్థం అయిందని ఈ సందర్భంగా కౌశల్ వ్యాఖ్యానించాడు. తనను గెలిపించేందుకు అభిమానులు వేసిన ప్రతి ఓటునూ తాను మరచిపోలేనని అన్నాడు. ఈ విజయం తనకెంతో స్ఫూర్తిని ఇచ్చిందని తెలిపాడు. త్వరలోనే అభిమానులను కలుసుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తానని తెలిపాడు. కాగా, తన భార్య, బిడ్డలతో కలసి లైవ్ లోకి వచ్చిన కౌశల్, ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. 

Biggboss
Koushal
Fans
Koushal Army
  • Loading...

More Telugu News