Malayalam: వారం రోజులు మృత్యువుతో పోరాడి... కన్నుమూసిన సింగర్ బాలభాస్కర్!

  • గత నెల 25న కారు ప్రమాదం
  • స్పాట్ లోనే మరణించిన బాలభాస్కర్ కుమార్తె
  • ఇంకా ఆసుపత్రిలోనే భార్య శాంతకుమారి

గత నెల 25న తిరువనంతపురం శివారు ప్రాంతంలో కారు ప్రమాదానికి గురైన ప్రముఖ సింగర్, వయోలినిస్ట్ బాలభాస్కర్ (40) కన్నుమూశారు. దీంతో గత వారం రోజులుగా ఆయన కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న అభిమానులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

 త్రిస్సూర్ లో దైవ దర్శనానికి వెళ్లి, తిరిగి వస్తున్న వేళ, ఆయన కారు అదుపుతప్పి, ఓ చెట్టును ఢీకొనగా, బాలభాస్కర్ కుమార్తె తేజస్వి (2) అక్కడికక్కడే మరణించింది. ఆయన భార్య శాంతకుమారి, డ్రైవర్ అర్జున్ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలభాస్కర్ మెదడుకు గాయం కావడం వల్లే మరణించారని వైద్య వర్గాలు వెల్లడించాయి.

కాగా, 12 సంవత్సరాల వయసులోనే సంగీత వృత్తిలోకి ప్రవేశించి, మలయాళ చిత్ర పరిశ్రమలో అతి చిన్నవయసున్న సంగీత దర్శకుడిగా పనిచేసిన గుర్తింపును తెచ్చుకున్నారు. వయోలినిస్ట్ గా ఉస్తాద్ జాకిర్ హుస్సేన్, శివమణి, హరిహరన్, ఫాజల్ ఖురేషి తదితరులతో కలసి పనిచేశారు.

Malayalam
Balabhaskar
Road Accident
  • Loading...

More Telugu News