Mahatma Gandhi: గాంధీ జయంతి స్పెషల్.. రైల్వే ప్రయాణికులకు నేడు కోరిన ఆహారం!

  • ప్రయాణికులకు నేడు మాంసాహారం కూడా
  • గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రైల్వే బోర్డు
  • ఐఆర్‌సీటీసీకి ఆదేశాలు

రైల్వే ప్రయాణికులు నేడు ఏది కావాలంటే అది తినొచ్చు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రయాణికులు కోరుకున్న ఆహారాన్ని అందించేందుకు ఐఆర్‌సీటీసీ సిద్ధమైంది. ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి ఐఆర్‌సీటీసీకి సమాచారం అందింది. అంటే ప్రయాణికులు కోరుకుంటే మాంసాహార భోజనాన్ని కూడా అందించనున్నారు.

నిజానికి 2018 నుంచి 2020 వరకు మూడేళ్లపాటు గాంధీ జయంతి జయంతి సందర్భంగా అక్టోబరు 2ను శాకాహార దినంగా పాటించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు మే నెలలోనే అన్ని జోనల్ కార్యాలయాలకు నోటీసులు పంపింది. అయితే, తాజాగా ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షించిన రైల్వే బోర్డు.. ఆ నిర్ణయాన్ని పక్కనపెట్టింది. ప్రయాణికులు కోరుకున్న ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది. ప్రయాణికులు కోరుకుంటే మాంసాహారాన్ని కూడా అందించాలంటూ ఐఆర్‌సీటీసీకి ఆదేశాలు జారీ చేసింది.

Mahatma Gandhi
IRCTC
Railway Board
Food
  • Loading...

More Telugu News