Balakrishna: మరో వివాదం... అభిమానులను కాలుతో తన్నిన బాలకృష్ణ!

  • తల్లాడ - మిట్టపల్లి మధ్య ఘటన
  • కారుకు అడ్డుగా వచ్చిన అభిమానులు
  • కాలితో తన్నారని ఆరోపణలు

సినీ నటుడు, నందమూరి బాలకృష్ణ, మరోసారి తన అభిమానులపై తీవ్రంగా ఆగ్రహించారు. నిన్న ఖమ్మం జిల్లా తల్లాడ - మిట్టపల్లి మధ్యలో ఈ ఘటన జరిగింది. బాలయ్య ర్యాలీగా వెళుతున్నారని తెలుసుకున్న అభిమానులు, పెద్ద ఎత్తున ఆయన కాన్వాయ్ కి ఎదురుగా వెళ్లి కారును ఆపారు.

అప్పటికే సత్తుపల్లి సభకు సమయం మించి పోతుండటంతో, వారిని పక్కకు తొలగాలని చెప్పినా వినలేదు. దీంతో ఆగ్రహానికి గురైన బాలయ్య, కారు దిగి వచ్చి తమను కాలితో తన్నారని షేక్ లాలూ, రమేష్, కృష్ణయ్య అనే యువకులు ఆరోపించారు. తాము అభిమానంతో వస్తే బాలకృష్ణ ఇలా చేయడం ఏంటని ప్రశ్నించిన వారు, రోడ్డుపైనే నిరసనలకు దిగి, టీడీపీ ప్లెక్సీలు, జెండాలను దగ్ధం చేశారు. ఈ ఘటనతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగా, బాలకృష్ణ మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా తనదారిన తాను సత్తుపల్లి వెళ్లి, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Balakrishna
Fans
Khammam District
Telugudesam
  • Loading...

More Telugu News