suresh raina: భర్తలోని సీక్రెట్ ట్యాలెంట్ ను వెల్లడించిన సురేష్ రైనా భార్య

  • రైనాలో మంచి గాయకుడు ఉన్నాడు
  • నాకు పదేళ్ల వయసు నుంచే రైనా తెలుసు
  • రైనాకు స్పోర్ట్స్ కోచ్ మా నాన్నే 

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనాలోని మరో టాలెంట్ ను ఆయన భార్య ప్రియాంక బహిర్గతం చేసింది. రైనా ఒక టాలెంటెడ్ సింగర్ అని... ఎంతో బాగా పాటలు పాడుతాడని తెలిపింది. పాటలు పాడటం అంటే రైనాకు చాలా ఇష్టమని చెప్పింది. తన భార్త మంచి గాయకుడని తాను పక్కాగా చెప్పగలనని తెలిపింది.

'మిస్ ఫీల్డ్' అనే టీవీ కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. 2015 ఏప్రిల్ 4న రైనా, ప్రియాంకల పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు 20 ఏళ్ల నుంచే ఇద్దరికి పరిచయం ఉంది. తనకు పదేళ్ల వయసు నుంచే రైనా తెలుసని ప్రియాంక తెలిపింది.

స్కూల్లో రైనాకు తన తండ్రి టీచర్, స్పోర్ట్ కోచ్ అని ప్రియాంక తెలిపింది. ఒక టీచర్ గా రైనాను తన తండ్రి ప్రతి రోజు చూసేవారని చెప్పింది. తమ ఇళ్లు పక్కపక్కనే ఉండేవని... దీంతో రైనా అమ్మ, మా అమ్మ ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారని తెలిపింది.

suresh raina
wife
priyanka
team india
  • Loading...

More Telugu News