Gujarat: రొమాంటిక్ క్రైమ్ స్టోరీ.. పెళ్లి పేరుతో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న పోలీస్!

  • మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఘటన
  • పెళ్లికి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు
  • మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న మగ కానిస్టేబుల్

సాధారణంగా మహిళా ఉద్యోగులను సహోద్యోగులు, ఉన్నతాధికారులు లైంగిక వేధింపులకు గురిచేసినట్లు వింటూ ఉంటాం. కానీ మహారాష్ట్రలోని కోల్హాపూర్ లో మాత్రం సీన్ రివర్స్ అయింది. తమనే పెళ్లి చేసుకోవాల్సిందిగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు వెంటపడి వేధించడంతో ఓ పురుష కానిస్టేబుల్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

కొల్హపూర్ లోని రాజారాంపురి పోలీసు స్టేషనుకు చెందిన 42 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్ ఇటీవల వివాహం చేసుకున్నాడు. అయితే బాధితుడు 2012-14 మధ్యకాలంలో గాంధీనగర్ పీఎస్ లో పనిచేశాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో ఏర్పడిన పరిచయం, అక్రమ సంబంధానికి దారితీసింది. తాజాగా బాధితుడు పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు తమనే పెళ్లి చేసుకోవాలని అతనిపై ఒత్తిడి తెచ్చారు.

వీరిలో ఒకరు ఏకంగా బాధితుడి ఇంటికి వెళ్లి ‘నీ భర్తకు విడాకులు ఇచ్చేయ్.. లేదంటే ఇబ్బంది పడతావ్’ అని అతన భార్యను హెచ్చరించింది. ఈ వేధింపులు హద్దులు దాటడంతో ఆవేదన చెందిన సదరు వ్యక్తి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాధితుడి భార్య ఫిర్యాదుతో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లపై ఐపీసీ సెక్షన్ 306, 504, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Gujarat
gandi nagar
Police
Maharashtra
kolhapur
suicide
women
  • Loading...

More Telugu News