raj kapoor: బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్ భార్య కన్నుమూత!

  • తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ తో మృతి
  • 1946లో రాజ్ కపూర్ ను పెళ్లాడిన కృష్ణా రాజ్ కపూర్
  • కృష్ణా రాజ్ కపూర్ వయసు 87 ఏళ్లు

బాలీవుడ్ నట దిగ్గజం, నిర్మాత, దర్శకుడు దివంగత రాజ్ కపూర్ భార్య కృష్ణా రాజ్ కపూర్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆమె మరణాన్ని కుటుంబసభ్యులు నిర్ధారించారు. ఆమె వయసు 87 ఏళ్లు. ఈ సందర్భంగా ఆమె పెద్ద కుమారుడు రణధీర్ కపూర్ మాట్లాడుతూ, 'ఈ ఉదయం 5 గంటలకు మా అమ్మ తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్ తో ఆమె చనిపోయారు. వయసు కూడా ఆమె మరణానికి మరో కారణం. మా అమ్మ మరణంతో మేమంతా ఎంతో ఆవేదనలో మునిగిపోయాం' అని తెలిపారు. చెంబూర్ క్రెమటోరియంలో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు.

1946లో కృష్ణ మల్హోత్రాను రాజ్ కపూర్ పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారులు రణధీర్ కపూర్, రిషి కపూర్, రాజీవ్ కపూర్... కుమార్తెలు రీమా జైన్, రీతు నానాలు జన్మించారు. బాలీవుడ్ స్టార్లు రణబీర్ కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్ లు వీరి మనవడు, మనవరాళ్లు అనే విషయం తెలిసిందే.

మరోవైపు రణధీర్ కపూర్, రాజీవ్ కపూర్ లు ముంబైలో ఉండగా.... నిన్ననే రిషి కపూర్ అమెరికా వెళ్లారు. వైద్య చికిత్స కోసం ఆయన యూఎస్ వెళ్లారు. తల్లి మరణవార్తతో ఆయన తిరుగుపయనమయ్యే అవకాశం ఉంది.

raj kapoor
krishna raj kapoor
passes
bollywood
  • Loading...

More Telugu News