Konda Surekha: అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తానంటే.. క్లారిటీ ఇచ్చేసిన కొండా సురేఖ!

  • పరకాలలో పర్యటించిన మాజీ మంత్రి
  • కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని వెల్లడి
  • ఇటీవలే టీఆర్ఎస్ ను వీడిన కొండా దంపతులు

వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఇటీవల టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్ కారణంగానే తాము బయటకు వెళ్లిపోతున్నట్లు కూడా ఆమె ప్రకటించారు. అయితే భర్త మురళి, కుమార్తెతో పాటు కలిపి మూడు ఎమ్మెల్యే సీట్లు కోరడంతో కేసీఆర్ అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్న విషయమై కొండా సురేఖ క్లారిటీ ఇచ్చేశారు.

నిన్న పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు, దామెరలో కుటుంబ సభ్యులు, బంధువులను కొండా సురేఖ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాభీష్టం మేరకు పరకాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. పరకాల, భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేయాల్సిందిగా అభిమానులు, కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. తాను పరకాలలో పోటీ చేయడంతో పాటు మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Konda Surekha
Telangana
parakala
contest
Congress
TRS
  • Loading...

More Telugu News