nagachaitanya: ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'సవ్యసాచి' టీజర్

  • చైతూ కథానాయకుడిగా 'సవ్యసాచి'
  • ప్రతినాయకుడిగా మాధవన్ 
  • ముఖ్యమైన పాత్రలో భూమిక

చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు. "మాములుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం .. ఒకే శరీరం పంచుకుని పుడితే దాన్ని అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలుని .. వరుసకి కనిపించని అన్నని .. కడదాకా వుండే కవచాన్ని .. ఈ సవ్యసాచిలో సగాన్ని" అంటూ చైతూ వాయిస్ పై టీజర్ ను కట్ చేశారు.

ఈ టీజర్ ను బట్టి కంటెంట్ కొత్తగా .. ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనే విషయం అర్థమవుతోంది. భూమిక ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా మాధవన్ కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. 'ప్రేమమ్' తరువాత చందూ ..  చైతూ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు వున్నాయి. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News