Jagan: కాళ్లు కాలుతాయ్ తల్లీ... అంటూ చెప్పు తెప్పించిన జగన్!

  • ప్రస్తుతం విజయనగరం జిల్లాలో జగన్ పాదయాత్ర
  • యాత్రలో పాల్గొన్న బాలిక సంగీత
  • చెప్పు జారిపోడవంతో చలించిపోయిన జగన్
  • కాళ్లు కాలకుండా తన కాలు ఆసరా

వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. బీమసింగి సంక్షన్ నుంచి బలరామపురం మధ్యలో చంద్రంపేటకు చెందిన చలుమూరి ఏలేష్, రమణమ్మ దంపతులు, తమ పిల్లలతో కలసి పాదయాత్రలో జగన్ తో పాటు నడిచారు. ఈ సమయంలో ఎండ చాలా ఎక్కువగా ఉంది. స్వల్ప తొక్కిసలాట జరగడంతో రమణమ్మ కుమార్తె సంగీత ఒక చెప్పు ఎక్కడో జారిపోయింది. చెప్పు కోసం తన అన్న జగన్ కు దూరం కావడం ఇష్టంలేని సంగీత, ఒక చెప్పుతోనే నడిచే ప్రయత్నం చేసింది.

దీన్ని చూసిన జగన్, "కాళ్లు కాలిపోతాయి తల్లీ" అని వారించారు. అయినా సంగీత వినలేదు. ఎండకు ఇబ్బంది పడుతున్నావమ్మా అంటూ, తన సెక్యూరిటీకి, చెప్పు ఎక్కడ పడిందో చూసి తేవాలని పురమాయించారు. వారు చెప్పును వెతికి తెచ్చేంత వరకూ సంగీత కాలు కాలకుండా, తన పాదాన్ని ఆమె పాదానికి ఆసరా ఇచ్చారు జగన్. సెక్యూరిటీ సిబ్బంది చెప్పును తెచ్చేంత వరకూ ఆ చిన్నారితో మాట్లాడుతూ ఉన్న జగన్, అంతసేపూ ఆమె కాలికిందనే తన కాలును ఉంచారు. ఆపై జగన్ వెంట సంగీత మరికొంత దూరం నడిచింది. ఆ ఫొటోను మీరూ చూడండి!

Jagan
Padayatra
Sangeeta
Shoe
  • Loading...

More Telugu News