Jagityala: ప్రియురాలి కోసం ఇద్దరు టెన్త్ విద్యార్థుల బలి... విషయం తమకు తెలియదన్న పాఠశాల!

  • జగిత్యాలలో తీవ్ర కలకలం రేపిన విద్యార్థుల మరణం
  • వారి వివాదం గురించి తమకు తెలియదన్న పాఠశాల కరస్పాండెంట్
  • మృతికి సంతాపంగా నేడు పాఠశాలకు సెలవు

జగిత్యాలలో తీవ్ర కలకలం రేపిన ఇద్దరు పదవ తరగతి విద్యార్థుల మరణంపై వారు చదువుతున్న సెయింట్ జాన్ స్కూల్ స్పందించింది. పాఠశాల కరస్పాండెంట్ శోభ మాట్లాడుతూ, వీరిద్దరి మధ్యా ఉన్న గొడవ గురించి తనకు ఎటువంటి విషయమూ తెలియదని చెప్పారు. మహేందర్ రోజూ స్కూలుకు వచ్చే విద్యార్థని, రవితేజ అప్పుడప్పుడూ మాత్రమే స్కూల్ కు వస్తాడని అన్నారు. విద్యార్థుల మృతి విచారకరమని, వీరిద్దరి మృతికి సంతాపంగా పాఠశాలకు ఒకరోజు సెలవు ప్రకటించామని అన్నారు.

కాగా, ఒకే అమ్మాయితో ప్రేమలో ఉన్న ఇద్దరూ, నిన్న మద్యం తాగి, గొడవపడి, ఒకరిపై ఒకరు పెట్రోలు చల్లుకుని నిప్పంటించుకుని మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మైనర్లయిన వీరికి మద్యం ఎలా సరఫరా చేశారంటూ, సదరు మద్యం దుకాణంపై కేసు పెట్టారు. ఇద్దరు బాలల మృతి కేసును తీవ్రంగా తీసుకున్న ఆబ్కారీ శాఖ సదరు వైన్ షాపు లైసెన్స్ ను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Jagityala
Students
Lover
Died
Wines Shop
  • Loading...

More Telugu News