Telangana: పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు.. స్పష్టత ఇచ్చిన కడియం శ్రీహరి

  • పార్టీ మారే ఉద్దేశం లేదు
  • ఆ వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు
  • అభ్యర్థుల జాబితాలో మార్పు ఉండదు

తాను పార్టీ మారబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించిన తొలి విడత అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో  అలకబూనిన శ్రీహరి పార్టీ మారబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారబోవడం లేదని తేల్చి చెప్పారు. తనకు కేసీఆర్ మాటే శిరోధార్యమన్నారు. తానేనాడు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదని పేర్కొన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు త్వరలోనే సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఎటువంటి మార్పు ఉండదని కడియం పేర్కొన్నారు.

Telangana
KCR
Kadiam Srihari
Rajaiah
Hanamakonda
  • Loading...

More Telugu News