Srikakulam District: అరసవల్లిలో అద్భుతం... పులకించిన భక్తులు!

  • శ్రీ సూర్య నారాయణుని తాకిన సూర్య కిరణాలు
  • తొలుత మేఘాలు అడ్డువచ్చి భక్తుల్లో నిరాశ
  • ఆపై ముఖంపై కిరణాలు పడటంతో ఆనందం

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ ఉదయం స్వామివారి ముఖాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఆదిత్యుని పాదాలను సూర్యకిరణాలు తాకాల్సిన సమయంలో మేఘాలు అడ్డురాగా, నిరాశలో మునిగిపోయిన భక్తులు, ఆపై క్షణాల వ్యవధిలోనే, స్వామి వారి ముఖానికి సూర్య కిరణాలు తాకడంతో భక్తులు పరవశించిపోయారు.

ప్రతి సంవత్సరం ఉత్తరాయణం నుంచి దక్షిణాయణానికి మారే సందర్భంలో సూర్య కిరణాలు మూలవిరాట్టును తాకే అద్భుత దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది వస్తారు. స్వామివారి పాదాలను తాకి, ఆపై శిరస్సు వరకు కిరణాలు వెళ్లే అద్భుత ఘట్టం మార్చి  9, 10 తేదీల్లో, అలాగే అక్టోబరు 1, 2 తేదీల్లో కనువిందు చేస్తుంది. కేవలం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మాత్రమే కనిపించే ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. ఈ సంవత్సరం మార్చిలో దట్టమైన మేఘాల కారణంగా కిరణాలు స్వామివారిని తాకని సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News