Tanusri Dutta: తనుశ్రీ చెబుతున్న దానిని నమ్ముతున్నాం: ప్రియాంక, సోనమ్, కంగనా!

  • తనుశ్రీ దత్తాని వేధించిన నానాపటేకర్  
  • ఆమె మాటలను అందరూ వినాలి
  • నానాటికీ తనుశ్రీకి పెరుగుతున్న మద్దతు

నటుడు నానాపటేకర్ తనను వేధించాడని చెబుతూ బాలీవుడ్ లో కలకలం రేపిన తనుశ్రీ దత్తాకు ఇప్పుడు మద్దతు పెరుగుతోంది. పలువురు హీరోయిన్లు ఆమె చెప్పిన విషయాన్ని నమ్ముతున్నట్టు వ్యాఖ్యానించారు. హీరోయిన్లు ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్, సోనమ్ కపూర్ లతో పాటు ఫర్హాన్ అక్తర్ తనుశ్రీకి మద్దతుగా నిలిచారు. ఓ మహిళగా ఆమె చెప్పే విషయాలను నమ్ముతున్నామని, ఆమె మాటలను అందరూ వినాలని అంటున్నారు.

తనుశ్రీతో కలసి సినిమాల్లో నటించిన పాయల్ ఈ విషయమై స్పందిస్తూ, తనకూ 2011లో ఇటువంటి ఘటనే ఎదురైందని, దర్శకుడు దివాకర్ బెనర్జీ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెబితే, ఆయన చాలా మంచివాడని అన్నారని గుర్తు చేసుకుంది. అనురాగ్ కశ్యప్ సైతం తాను పిచ్చిదాన్నని వ్యాఖ్యానించారని చెప్పింది. దాని ప్రభావంతో తనకు అవకాశాలు తగ్గాయని వ్యాఖ్యానించింది. మలయాళంలో నటుడు దిలీప్ కుమార్ వివాదం, టాలీవుడ్ లో శ్రీరెడ్డి వివాదం బయటకు వచ్చినప్పుడు 'మీ టూ' వంటి ఉద్యమాలు ఊపందుకోవడం లేదని, దీనికి కారణం ఏంటో తెలియడం లేదని చెప్పింది.

Tanusri Dutta
Sonam Kapoor
Priyaanka Chopra
Kangana Ranout
  • Loading...

More Telugu News