Khammam District: తెలంగాణ ఎన్నికల కోసం... నేడు స్వయంగా రంగంలోకి బాలకృష్ణ!

  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటన
  • ఏర్పాట్లు పూర్తి చేసిన స్థానిక నేతలు
  • సాయంత్రం సత్తుపల్లిలో భారీ బహిరంగ సభ

ప్రముఖ సినీనటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ, నేటి నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. నేడు ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనుండగా, స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. మధిర, సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే బాలయ్య, పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.

దాదాపు 45 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి, టీడీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. సత్తుపల్లి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారని భావిస్తున్న సండ్ర వెంకట వీరయ్యను గెలిపించాలని బాలకృష్ణ ప్రజలను కోరనున్నారు. ఆపై సాయంత్రం సత్తుపల్లిలో జరిగే భారీ బహిరంగ సభలో బాలకృష్ణ ప్రసంగించనున్నారు.

Khammam District
Balakrishna
Telugudesam
Sandra Venkata Veeraiah
  • Loading...

More Telugu News