Pawan Kalyan: పవన్‌కు జరగరానిది జరిగితే రాష్ట్రం భగ్గుమంటుంది: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

  • పవన్‌కు ఏదైనా జరిగితే చంద్రబాబే బాధ్యత వహించాలి
  • పవన్‌కు గట్టి భద్రత ఏర్పాటు చేయాలి
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏమైనా జరగరానిది జరిగితే రాష్ట్రం భగ్గుమంటుందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. పవన్ తనకు భద్రత లేదని చెబుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆరోపించారు. పవన్‌కు ఏమైనా జరిగితే దానికి చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పవన్‌కు గట్టి భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు పట్టపగలే చంపేశారని, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, పోలీసులు రోడ్డెక్కారని పేర్కొన్నారు. నాలుగేళ్లపాటు ఉద్యోగాల ఊసెత్తని చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో నిరుద్యోగ భృతిని తెరపైకి తెచ్చారని రామకృష్ణ విమర్శించారు.

Pawan Kalyan
CPI
K.Ramakrishna
Chandrababu
Andhra Pradesh
  • Loading...

More Telugu News