Suman: అభివృద్ధి ఆగకూడదనుకుంటే మళ్లీ చంద్రబాబునే గెలిపించండి: సినీ నటుడు సుమన్

  • టీడీపీ టికెట్‌పై పోటీ చేయడం లేదు
  • నా దృష్టంతా తెలంగాణపైనే
  • పవన్ లాంటి వాళ్లు రాజకీయాల్లో అవసరం

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ఆగకూడదనుకుంటే తిరిగి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడినే గెలిపించాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం తన దృష్టి అంతా తెలంగాణపైనే ఉందని స్పష్టం చేశారు. తాను గుంటూరు జిల్లా రేపల్లె నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టి పారేశారు. కేసీఆర్ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.

ఏపీలో అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉండాలంటే చంద్రబాబును మళ్లీ గెలిపించాలన్న సుమన్.. భవిష్యత్తులో కేసీఆర్ ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తే తీసుకుంటానని పేర్కొన్నారు. బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బీసీల కోసం పార్టీ పెడితే మద్దతిస్తానని సుమన్ పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌లా ప్రశ్నించే వాళ్లు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని సుమన్ అభిప్రాయపడ్డారు.

Suman
Chandrababu
KCR
Telangana
Telugudesam
Jana sena
Pawan Kalyan
  • Loading...

More Telugu News