BigBoss: అట్టహాసంగా బిగ్‌బాస్ ఫినాలే.. విజేతగా కౌశల్!

  • రూ.50 లక్షల ప్రైజ్ మనీ అందుకున్న కౌశల్
  • కౌశల్‌కు గట్టి పోటీ ఇచ్చిన గీతా మాధురి
  • షోలో సందడి చేసిన వెంకటేశ్

వంద రోజులకుపైగా ఉత్కంఠగా సాగిన తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-2 విజేతగా కౌశల్ నిలిచాడు. ఆదివారం అట్టహాసంగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో కౌశల్‌ను విజేతగా ప్రకటించారు. కౌశల్‌కు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన గీతామాధురి రన్నరప్‌గా మిగిలిపోయింది. విజేతగా ఎంపికైన కౌశల్ రూ.50 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు.

ఆదివారం ఉత్సాహంగా సాగిన ఫినాలేలో హౌస్‌ నుంచి గతంలో ఎలిమినేట్ అయిన వారు కూడా సందడి చేశారు. హౌస్‌మేట్స్ కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆటపాటలతో అదరగొట్టారు. ఈ వేడుకలకు నటుడు విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. విజేతగా కౌశల్‌ను ప్రకటించిన వెంటనే ఆయన అభిమానులుగా చెప్పుకునే ‘కౌశల్ ఆర్మీ’ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంది. నిజానికి కౌశల్ గెలుపు ముందు నుంచి ఊహిస్తున్నదే. 113 రోజులపాటు సాగిన ఈ షో విశేష ఆదరణ చూరగొంది. వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాని బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

BigBoss
Kaushal
Geetha Madhuri
Nani
Venkatesh
Star Maa
  • Loading...

More Telugu News