me too movement: పనిమనిషిపై అత్యాచారం... అనంతరం పశ్చాత్తాపంతో వివాహం: 17వ శతాబ్దం నాటి ఘటన వెలుగులోకి!

  • డైరీలో రాసుకున్న బ్రిటీష్‌ దేశస్థుడు ఎడ్వర్డ్‌ బార్లో
  • ఓడ సహాయకుడిగా జీవితాన్ని ప్రారంభించిన బార్లో
  • విలపిస్తూ కనిపించిన పనిమనిషి 

‘అతనో ఓడ సహాయకుడు. అనుకోని పరిస్థితుల్లో పనిమనిషిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో సందర్భంలో బాధితురాలు కలిసినప్పుడు ఆమె భోరున విలపించడంతో పశ్చాత్తాపం చెంది పెళ్లి చేసుకున్నాడు’... పదిహేడో శతాబ్దంలో జరిగిన ఈ సంఘటన ఇటీవల వెలుగు చూసింది.

ప్రపంచవ్యాప్తంగా ఉవ్వెత్తున సాగుతున్న 'మీటూ' ఉద్యమం ఎన్నో ప్రేమకథల్ని, లైంగిక వేధింపులను, అత్యాచారాలను వెలుగులోకి తెస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు పలువురు జైలు పాలయ్యేందుకు ఈ ఉద్యమం కారణమవుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ హాస్య, టీవీ నటుడు బిల్‌ కాస్బీ కూడా జైలుపాయ్యాడు. ఈ ఉద్యమమే ఈ బ్రిటీష్‌ నావికుడి చర్యను బయటపెట్టింది.

వివరాల్లోకి వెళితే...బ్రిటన్‌కు చెందిన ఎడ్వర్డ్‌ బార్లో సముద్రయాన చరిత్ర అధ్యయనకారులకు సుపరిచితుడు. 17వ శతాబ్దానికి చెందిన బార్లో ఓడ సహాయకునిగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ రోజుల్లో పనిమనిషి మేరీ సైమన్స్‌పై లైంగిక దాడిచేశాడు. అనంతరం పశ్చాత్తాపంతో ‘తాను చేసింది సరైన చర్యకాదని, సభ్యసమాజం అంగీకరించదని’ తన డైరీలో రాసుకున్నాడు.

మరో సముద్రయానం తర్వాత ఇంటికి వచ్చిన బార్లోకు, మేరీ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కనిపించింది. తన జీవితం వ్యర్థమైపోయిందని బాధపడింది. దీంతో పశ్చాత్తాపానికి గురైన బార్లో ఆమెను వివాహమాడాడు. లైంగికదాడిని మాత్రం బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. 17వ శతాబ్దంలో జరిగిన ఈ లైంగిక దాడిని చరిత్రకారులు  తాజాగా వెలికి తీశారు.

  • Loading...

More Telugu News