Ram: అబ్బే, అలాంటిదేం లేదు.. రకుల్ ప్రీత్ తో ఎంగేజ్ మెంట్ పై స్పందించిన హీరో రామ్!

  • 'పండగచేస్కో' చిత్రంలో జతకట్టిన రామ్, రకుల్ ప్రీత్ సింగ్
  • ప్రేమలో పడ్డారని, నిశ్చితార్థం జరిగిపోయిందని వార్తలు
  • రకుల్ తనకు అంత క్లోజ్ కాదని చెప్పిన రామ్
  • ఎవరో అనుకుని పుట్టించిన పుకారేనని స్పష్టీకరణ

'పండగచేస్కో' చిత్రంలో జతకట్టిన రామ్, రకుల్ ప్రీత్ సింగ్ పీకల్లోతు ప్రేమలో పడ్డారని, వారిద్దరికీ ఎంగేజ్ మెంట్ జరిగిందని కొంతకాలం క్రితం ఓ వార్త హల్ చేసి, టాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా, రామ్ ఈ విషయమై స్పందించాడు. తామిద్దరమూ కలసి ఒకే సినిమా చేశామని, రకుల్ తనకు అంత క్లోజ్ కూడా కాదన్న రామ్, ఎవరో ఒకరిద్దరు అనుకుని పుట్టించిన గాసిప్ ఇదని, తనకు రకుల్ తో నిశ్చితార్థం ఏంటని ప్రశ్నించాడు.

ఎక్కడి నుంచి ఈ వార్త వచ్చిందో తెలియలేదని, తాను వాటిని పట్టించుకోబోనని అన్నాడు. తనపై వచ్చే గాసిప్స్ గురించి అన్నయ్య, స్నేహితులు చెబుతూ ఉంటారని అన్నాడు. తనకు ఇంతవరకూ ఏ అమ్మాయీ కనెక్ట్ కాలేదని, తనకు ఎవరైనా నచ్చితే, అర్ధరాత్రి పూట మీడియాకు ఫోన్ చేసి విషయం చెబుతానని అన్నాడు. తనకు స్నేహితులు చాలా తక్కువని, బయటకు పెద్దగా వెళ్లేది లేదని, ఖాళీ దొరికితే కుటుంబ సభ్యుల మధ్యే ఉంటానని కూడా రామ్ చెప్పాడు.

Ram
Rakul Preet Singh
Pandaga Chesko
Engagement
  • Loading...

More Telugu News