Jana Sena: జనసేన ప్రధాన కార్యదర్శిగా ముత్తంశెట్టి కృష్ణారావు

  • పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం
  • ప్రస్తుతం కృష్ణ, గుంటూరు జిల్లాల సమన్వయకర్తగా పనిచేస్తున్న కృష్ణారావు
  • పార్టీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తానని వెల్లడి

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ కీలక పోస్టుల భర్తీ ప్రారంభించారు. పార్టీలో అత్యంత ముఖ్యమైన ప్రధాన కార్యదర్శిగా ముత్తంశెట్టి కృష్ణారావును నియమించారు. ప్రస్తుతం కృష్ణారావు కృష్ణ, గుంటూరు జిల్లాల సమన్వయకర్తగా పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. తాజా నియామకంతో పార్టీ అధినేత ఆయనకు పెద్దపనే అప్పగించినట్లయింది. తన నియామకంపై కృష్ణారావు స్పందిస్తూ అధినేత ఆలోచనలకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

Jana Sena
Pawan Kalyan
muttamsetty srinivas
  • Loading...

More Telugu News