Vejayashanti: కేసీఆర్ నాకు అన్నేమీ కాదు: విజయశాంతి

  • కేసీఆరే నన్ను దేవుడిచ్చిన చెల్లెలని చెప్పారు
  • నేను ఎన్నడూ ఆ మాట అనలేదు
  • కాంగ్రెస్ నేతలపై కేసులతో టీఆర్ఎస్ కే నష్టం
  • కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి

కేసీఆర్ తనను దేవుడిచ్చిన చెల్లెలని చెప్పేవారు కానీ, తాను ఎన్నడూ అలా అనలేదని సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి వ్యాఖ్యానించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన కూడా మారిపోయారని, తమ మధ్య జరిగే యుద్ధంలో ధర్మమే గెలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ప్రస్తుతం తెలంగాణలో జిల్లాలు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్న ఆమె, ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, చివరిసారిగా కేసీఆర్ తనకు పార్లమెంట్ లో ఎదురుపడి పలకరించారని, ఆ తరువాత తామిద్దరమూ కలవలేదని చెప్పారు.

కాంగ్రెస్ నేతలపై పెడుతున్న కేసులతో టీఆర్ఎస్ పార్టీకే నష్టమని, ఈ విషయాన్ని ఆ పార్టీ వారే తనకు ఫోన్ చేసి చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రచారం చేయనున్నానని, ఆ విజయాన్ని సోనియాగాంధీకి కానుకగా ఇస్తామన్న నమ్మకం ఉందని అన్నారు. తాను అసెంబ్లీకి పోటీ చేయాలని భావించడం లేదని, ప్రస్తుతానికి ప్రచారానికే పరిమితమయ్యే తాను, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ విషయమై తరువాత ఆలోచిస్తానని అన్నారు.

Vejayashanti
KCR
Telangana
Elections
  • Loading...

More Telugu News