bihar: డాక్టర్ కుమారుడిని కిడ్నాప్ చేసిన స్నేహితులు.. రూ.50 లక్షల డిమాండ్.. హత్య

  • బీహార్‌లో కలకలం సృష్టిస్తున్న కిడ్నాప్‌లు
  • ఒకే సమయంలో రెండు ఘటనలు
  • బాలుడిని రక్షించలేకపోయిన పోలీసులు 

గురువారం కిడ్నాప్‌కు గురైన 15 ఏళ్ల బాలుడు శనివారం హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. బీహార్‌లో జరిగిందీ ఘటన. రుపాస‌పూర్ ప్రాంతానికి చెందిన వైద్యుడు శశిభూషణ్ ప్రసాద్ గుప్తా కుమారుడు సత్యం కుమార్ గురువారం సాయంత్రం కోచింగ్ క్లాసులకు వెళ్లి తిరిగి వస్తుండగా అపహరణకు గురయ్యాడు. రూ.50 లక్షలు ఇస్తే సత్యంను క్షేమంగా విడిచిపెడతామని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. దీంతో భయపడిన బాలుడి తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు శనివారం బాలుడి మృతదేహం లభ్యమైనట్టు ఎస్పీ రవీందర్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు పేర్కొన్నారు.

కాగా, ఇటువంటి ఘటనే ఇటీవల జరిగింది. బిహార్ క్షేత్రీయ గ్రామీణ్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ జవర్థన్ కుమార్ గురువారం బ్యాంకు నుంచి వస్తుండగా కొందరు దుండగులు ఆయనను కిడ్నాప్ చేశారు. అతడి కుటుంబానికి ఫోన్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. దాదాపు ఒకే సమయంలో ఈ రెండు ఘటనలు జరగడం గమనార్హం.

bihar
Kidnap
India
Doctor
Nitish kumar
Murder
  • Loading...

More Telugu News